మెనింజైటిస్ రోగుల కొరకు

(ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వైద్యవిధానం)

(నిరాశకు మించిన ఆశ)

మెనింజైటిస్‌తో పోరాడడం పెద్ద సవాలు. కొందరు త్వరగా నయమవుతారు, కానీ మరికొందరు నయం కారు. మరికొందరి విషయం ఏమిటంటే, వారు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వ్యాసం మెనింజైటిస్ గురించి “సమగ్ర చికిత్స” విధానాన్ని తెలుపుటకు వ్రాయబడింది. ఆసుపత్రిలో కొంత కాలంగా ఈ వ్యాధితో పోరాడుతున్న వారికి మరియు మెనింజైటిస్‌వలన కలిగిన దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి సహాయం చేయడానికి వ్రాయబడింది.

అయితే, ముందుగా మెనింజైటిస్ గురించి కొంత తెలుసుకుందాం.

మెనింజైటిస్ అంటే ఏమిటి?

మెనింజైటిస్ అనేది మెదడు మరియు వెన్నుపామును కప్పి ఉంచే పొరలు, అనగా “మెనింజెస్”  యొక్క వాపుతో కూడిన తీవ్రమైన ఎమర్జెన్సీ  వైద్య పరిస్థితి.

మెనింజైటిస్ యొక్క కారణాలు ఏమిటి?

మెనింజైటిస్ యొక్క సాధారణ కారణాలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్, కొన్ని మందులు మరియు రసాయనాలు.

మెనింజైటిస్ యొక్క లక్షణాలు ఏమిటి?

విపరీతమైన జ్వరం, మూర్ఛ, ఫోటోఫోబియా, మెడ బిగుతుగా మారటం, వికారం లేదా వాంతులతో కూడిన తీవ్రమైన తలనొప్పి, మానసిక స్థిమితం లేకపోవడం, మగత మరియు కోమా మెనింజైటిస్ యొక్క ముఖ్యమైన లక్షణాలు.

మెనింజైటిస్కు చికిత్స ఏమిటి ?

మెనింజైటిస్కు యాంటీబయాటిక్స్, యాంటీవైరల్‌లు, కార్టికోస్టెరాయిడ్స్ మరియు అవసరమైన ఇతర సహాయక మందులతో చురుకుగా చికిత్స చేయాలి. చికిత్స జరిగినప్పటికీ, మెనింజైటిస్ వలన వినికిడి లోపం, జ్ఞాపకశక్తి తగ్గడం, మానసిక వైకల్యాలు, నడక సమస్యలు, మెదడు దెబ్బతినడం, మూర్ఛ, కిడ్నీ వైఫల్యం, షాక్ మరియు కొన్నిసార్లు మరణం వంటి తీవ్రమైన సమస్యలు  కలుగుతాయి. మెనింగోకోకై, న్యుమోకాకై లేదా మంప్స్ వైరస్ ఇన్ఫెక్షన్ వంటి కొన్ని రకాల మెనింజైటిస్‌లను వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చు.

మెనింజైటిస్ చికిత్సలో హోమియోపతి పాత్ర ఏమిటి?

వ్యాధి యొక్క అన్ని దశలలోను హోమియోపతిని ఉపయోగించవచ్చు. వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి శరీరం యొక్క సహజ యంత్రాంగాన్ని చైతన్య పరచుటద్వారా హోమియోపతి పనిచేస్తుంది. హోమియోపతిలో ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి సహాయపడే అనేక రకాల మందులు ఉన్నాయి. వ్యాధి సోకిన ప్రారంభ రోజులలో అల్లోపతితో పాటుగా హోమియోపతిని కూడా కలిపి వాడటం వలన రోగికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే రోగి అల్లోపతి మరియు హోమియోపతి రెండింటిలోనూ ద్వంద్వ ప్రయోజనాన్ని పొందుతాడు.

మెనింజైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధిలో కూడా, హోమియోపతి వైద్యం రోగలక్షణాలను మెరుగుపరచడానికి మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ఎటువంటి ఆశాజనకంగా లేని సందర్భాల్లో కూడా, చికిత్స షెడ్యూల్‌లో హోమియోపతిని కలుపుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ విధానం “నిరాశాభావంలో” ఆశను తీసుకురాగలదు.